పద్మశ్రీ అవార్డు గ్రహీతపై అత్యాచార ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

By Medi Samrat
Published on : 28 Jun 2025 8:50 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీతపై అత్యాచార ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ పై సంచలన ఆరోపణలు చేసింది. 2013లో పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే కార్తీక్ మహారాజ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి మహారాజ్, ముర్షిదాబాద్‌లోని ఒక ఆశ్రమానికి తీసుకెళ్లి, ఆ ఆశ్రమంలో ఉన్న ఒక పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని ఆ మహిళ ఆరోపించింది. ఆమెకు ఆశ్రమంలో వసతి కూడా కల్పించారు. అయితే, ఒక రాత్రి, ఆ సన్యాసి తన గదిలోకి ప్రవేశించి తనపై బలవంతంగా దాడి చేశాడని ఆ మహిళ ఆరోపించింది. 2013 జనవరి-జూన్ మధ్య ఆరు నెలల్లో ఆ సన్యాసి కనీసం 12 సార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. భయం, నిస్సహాయత కారణంగా తాను ఇన్ని సంవత్సరాలు ఈ సంఘటన గురించి మౌనంగా ఉన్నానని ఆమె చెప్పింది. పోలీసులను సంప్రదిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కార్తీక్ మహారాజ్ బెదిరించాడని ఆమె తెలిపింది. ఫిర్యాదు నమోదైందని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. సంబంధిత విభాగాల కింద కార్తీక్ మహారాజ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

Next Story