పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'Z+' కేటగిరీ భద్రతను కల్పించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆయనకు ముప్పు ఉందని నిర్ధారించడంతో హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక తర్వాత హోం శాఖ గవర్నర్ CV ఆనంద్ బోస్‌కు Z+ కేటగిరీ భద్రతను కల్పించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు ఆనంద్ బోస్‌కు భద్రత కల్పించనున్నారు. సివి ఆనంద్ బోస్ గవర్నర్ కాకముందు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ సివి ఆనంద్ బోస్ నవంబర్ 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేరళ కేడర్‌కు చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సివి ఆనంద్ బోస్. 2011లో పదవీ విరమణ చేయడానికి ముందు నేషనల్ మ్యూజియంలో అడ్మినిస్ట్రేటివ్ గా పనిచేశారు. 2022 అక్టోబర్‌లో ఐదుగురు కేరళ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు వై కేటగిరీ భద్రత కల్పించారు. NIA నివేదిక ప్రకారం.. ఈ నేతలపై పీఎఫ్‌ఐ దాడులు జరుగుతాయనే భయం నెలకొంది. ఆ నేతల భద్రత కోసం పారామిలటరీ బలగాల కమాండోలను మోహరించారు.