హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు..!

భారతదేశంలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

By Kalasani Durgapraveen  Published on  12 Nov 2024 5:11 AM GMT
హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు..!

భారతదేశంలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. దేశీయంగా తయారు చేయబడిన హై-స్పీడ్ రైలు.. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్స్ నిర్వ‌హించ‌నుంది. బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. BEML భారతదేశ తొలి 'బుల్లెట్ రైలు' నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందింది. 8 కోచ్‌లతో కూడిన రెండు ట్రైన్‌సెట్‌లను నిర్మించేందుకు ₹867 కోట్ల విలువైన కాంట్రాక్టును BEMLకి జారీ చేశారు. ఈ ట్రైన్స్‌ ఒక్కోటి 280 కిమీ వేగంతో ప్రయాణించగలవు.

ఈ ట్రైన్‌సెట్‌లను కంపెనీ బెంగళూరులో నిర్మించి.. 2026 చివరి నాటికి డెలివరీ చేయాలి. ఈ హై-స్పీడ్ రైళ్లు పూర్తిగా భారతదేశంలోనే తయారవుతున్నాయి. మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 866.87 కోట్లు కాగా.. ఇందులో డిజైన్ ఖర్చు, వన్-టైమ్ డెవలప్‌మెంట్ ఖర్చు, నాన్-రికరింగ్ ఛార్జీలు, జిగ్‌లు, ఫిక్చర్‌లు, టూలింగ్, వన్-టైమ్ ఖర్చు ఉన్నాయి. స్వదేశీంగా తయారు చేయబడిన మొదటి హై-స్పీడ్ రైలు సెట్ 280 kmph పరీక్ష వేగంతో నడుస్తుంది. భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు సెట్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, చైర్ కార్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది, రిక్లైనింగ్, రొటేటబుల్ సీట్లు వంటి ఆధునిక సౌకర్యాలను క‌లిగిఉంటాయి.

Next Story