మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు. అయితే చాలా మంది మద్దతుదారులు.. పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనలో ఉన్నారు. ఇక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు ఆయన మధ్యాహ్నం శివపురి సెయిలింగ్‌కు చేరుకున్నారు. సింధియా సరస్సు వద్దకు చేరుకోగానే తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేశాడు.
సింధియాను ఆయన భద్రతా సిబ్బంది ఏదోవిధంగా రక్షించినప్పటికీ.. కొంతమంది మద్దతుదారులు, పోలీసులు తేనెటీగల బాధితులయ్యారు. యంత్రాన్ని ప్రారంభించేందుకు సింధియా క్లబ్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న పండిట్ అగరబత్తిని వెలిగించారు. పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.
జ్యోతిరాదిత్య సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. అయితే చాలా మంది నేతలు, మద్దతుదారులు, పోలీసులను తేనేటీగలు టార్గెట్ చేశాయి. కొంతమందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.