15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇక ఫైన‌ల్ మాములుగా ఉండ‌దు

BCCI announces Team India's 15-man squad for ICC World Test Championship final. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య‌

By Medi Samrat  Published on  15 Jun 2021 2:12 PM GMT
15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇక ఫైన‌ల్ మాములుగా ఉండ‌దు

ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య‌ జరగ‌నున్న ఐసీపీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌ ఫైనల్ కోసం టీమిండియా మేనేజ్ మెంట్ 15 మందితో జట్టును ప్రకటించింది. ఈ మేర‌కు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌కు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే కొనసాగనున్నారు. ఇక‌ జట్టులో రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లకు స్థానం కల్పించారు.

తెలుగు తేజం హనుమ విహారి జ‌ట్టులో ఉన్నాడు. యువ ఆట‌గాడు శుభ్ మాన్ గిల్ కు 15 మందిలో స్థానం ల‌బించింది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఐదుగురు పేసర్ల‌ను ఎంపిక చేసింది. అయితే తుది జ‌ట్టులో ఎవ‌రు ఆడుతారో తెలియాలంటే మ్యాచ్ రోజు వ‌ర‌కూ ఆగాల్సిందే.

జట్టు వివరాలు..

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
Next Story
Share it