ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది..!

BCCI Announces Schedule For TATA IPL 2023. ఐపీఎల్‌-2023 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది.

By Medi Samrat
Published on : 17 Feb 2023 6:18 PM IST

ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది..!

ముంబయి: ఐపీఎల్‌-2023 సీజన్‌ షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది. మార్చి 31 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో సీజన్‌ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 70 మ్యాచ్‌లుంటాయి. రెండో రోజు పంజాబ్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుండ‌గా, లక్నో సూపర్ జెయింట్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మే 21న చివరి లీగ్ మ్యాచ్ జరగనుండగా.. ప్ర‌తీ టీం హోం గ్రౌండ్‌లో 7 మ్యాచ్‌లు.. బ‌య‌టి వేదిక‌ల‌లో 7 మ్యాచ్‌లు ఆడ‌నుంది.

జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ A లో ఉండ‌గా, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ గ్రూప్ B లో ఉన్నాయి. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి మరియు ధర్మశాల ఈ ఏడాది IPL 2023 వేదికలుగా ఉన్నాయి.


Next Story