వినాయకచవితి రోజున మాంసం అమ్మకాలు ఉండకూడదు

BBMP Bans Animal Slaughter, Sale Of Meat On Ganesh Chaturthi. వినాయక చవితి రోజు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం

By Medi Samrat  Published on  9 Sept 2021 7:37 PM IST
వినాయకచవితి రోజున మాంసం అమ్మకాలు ఉండకూడదు

వినాయక చవితి రోజు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వినాయక చవితి రోజున మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వినాయక విగ్రహం వేడుక సమయంలోనూ, నిమజ్జనంలోనూ 20 మందికి మించి పాల్గొనడానికి రాష్ట్రం అనుమతించదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబరు 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదని ప్రభుత్వం తెలిపింది. కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 2శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమాలూ జరగబోవని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటూ గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇచ్చినప్పటికీ, బీబీఎంపీ మాత్రం మూడు రోజులకి తగ్గించింది.


Next Story