బీబీసీ కార్యాలయాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారుల బృందాలు సోమవారం బీబీసీ భారత కార్యాలయాల్లో సర్వే చేపట్టాయి. ముంబై, ఢిల్లీలోని కార్యాలయాలను ఈ బృందాలు సందర్శించాయి. ఈ సందర్భంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం అయ్యిందని, ఇప్పుడు భారత్‌లోని బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు బీజేపీకి కీలు బొమ్మలా మారాయని ఆరోపించారు. అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవర్ చేసుకుంటారా అని విమర్శించారు.