ఇటీవలి కాలంలో ఎక్కడ పడితే అక్కడ బ్లాస్ట్ అవుతూ.. వార్తల్లో నిలిచిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్‌లతో సహా వాటి బ్యాటరీలలోని లోపాల వల్ల ఈ ప్రమాదాలు సంభవించాయని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) నివేదిక పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఖర్చులను తగ్గించుకోవడానికి తక్కువ-గ్రేడ్ మెటీరియల్‌లను ఉపయోగించినందున ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తున కు ఆదేశించింది.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించినట్లు తెలుస్తోందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. వరుస ప్రమాదాల కారణంగా కొత్తగా ఎలెక్ట్రిక్ బైక్స్ కొనాలంటేనే భయపడుతూ ఉన్నారు.