ఇక గంటల్లోనే చెక్స్ క్లియర్ అవ్వాలి..!

అక్టోబర్ 4 నుండి కొన్ని గంటల్లోనే బ్యాంకులు చెక్స్ ను క్లియర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.

By Medi Samrat
Published on : 26 Aug 2025 4:19 PM IST

ఇక గంటల్లోనే చెక్స్ క్లియర్ అవ్వాలి..!

అక్టోబర్ 4 నుండి కొన్ని గంటల్లోనే బ్యాంకులు చెక్స్ ను క్లియర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ప్రస్తుతం క్లియరెన్స్ సమయం రెండు పని దినాలకు తగ్గించగా, రాబోయే రోజుల్లో అది కేవలం గంటలకు పరిమితమవ్వనుంది.

కొత్త విధానం ప్రకారం, బ్యాంకులు కొన్ని గంటల్లోనే చెక్కులను స్కాన్ చేసి, సమర్పించి, పాస్ చేస్తాయి. వ్యాపార సమయాల్లో నిరంతర ప్రాతిపదికన క్లియరింగ్ సైకిల్‌ను ప్రస్తుత T+1 రోజుల నుండి తగ్గించనున్నట్లుగా సెంట్రల్ బ్యాంక్ నుండి వచ్చిన సర్క్యులర్ తెలిపింది. ప్రస్తుత చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (CTS) రెండు పని దినాల వరకు క్లియరింగ్ సైకిల్‌లో చెక్కులను ప్రాసెస్ చేస్తుంది. చెక్ క్లియరింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సెటిల్మెంట్ ప్రమాదాన్ని తగ్గించడానికి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి CTS ను బ్యాచ్ ప్రాసెసింగ్ నుండి 'ఆన్-రియలైజేషన్-సెటిల్మెంట్' తో నిరంతర క్లియరింగ్ కు మార్చాలని RBI నిర్ణయించింది. CTS రెండు దశల్లో నిరంతర క్లియరింగ్, రియలైజేషన్ పై సెటిల్మెంట్ కు మారుతుంది. దశ 1 అక్టోబర్ 4, 2025న, దశ 2 జనవరి 3, 2026న అమలు చేయనున్నారు. ఒకే ప్రెజెంటేషన్ సెషన్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు షెడ్యూల్ చేశారు.

Next Story