ఈ వారంలో 6 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలివే..!

Banks are close 6 days here is the full details. పండగల నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల

By అంజి  Published on  18 Oct 2021 5:11 AM GMT
ఈ వారంలో 6 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలివే..!

పండగల నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈ వారంలో ఆరు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు క్లోజ్‌ చేయబడతాయి. బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో.. కస్టమర్లు బ్యాంకు సెలవుల గురించి తెలుసుకొని వెళ్లాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అక్టోబర్‌ మొదటి 15 రోజుల్లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అక్టోబర్‌ 16వ తేదీన సిక్కింలోని గాంగ్‌టక్‌లో దుర్గా పూజ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి. ఇక అక్టోబర్‌ 17వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు వచ్చింది.

అక్టోబర్‌ 18న కాటిబిహు పండగ కారణంగా అస్సాంలోని బ్యాంకులకు హాలిడే వచ్చింది. అక్టోబర్‌ 19న ఈద్‌ - ఇ - మిలాద్‌ సందర్భంగా దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగవు. ఇక అక్టోబర్‌ 20వ తేదీన వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తలా, కోల్‌కతా, సిమ్లా, చండీగఢ్‌, బెంగళూరులో బ్యాంకులకు సెలవు వచ్చింది. అక్టోబర్‌ 22వ తేదీన ఈద్‌ - ఇ - మిలాద్‌ - ఉల్‌ - నబీ పండగ నేపథ్యంలో జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలిడే వచ్చింది. అక్టోబర్‌ 23వ తేదీ నాల్గవ శనివారం కావడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు. అక్టోబర్‌ 24న ఆదివారం కారణంగా సాధారణ సెలవు వచ్చింది. అయితే ఆన్‌లైన్‌ సేవలు, ఏటీఎంలు యథాతథంగా సాగుతాయి.

Next Story
Share it