Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!
2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్‌లు తెలుసుకోవాలి.
By Medi Samrat Published on 27 Feb 2025 5:06 PM IST
2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్‌లు తెలుసుకోవాలి. వివిధ నగరాల్లోని బ్యాంకులు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, ప్రాంతీయ పండగల కారణంగా నిర్దిష్ట తేదీలలోసెలవులు ఉంటాయి. రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పనిచేయవు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రాష్ట్ర-నిర్దిష్ట బ్యాంకు సెలవుల వార్షిక క్యాలెండర్‌ను జారీ చేస్తుంది.
మార్చి 2025 బ్యాంక్ సెలవుల జాబితా
మార్చి 7 (శుక్రవారం): చాప్చార్ కుట్
మార్చి 13 (గురువారం): హోలికా దహన్, అట్టుకల్ పొంగలా
మార్చి 14 (శుక్రవారం): హోలీ (రెండో రోజు) - ధూలేటి, ధూలంది, డోల్ జాత్రా
మార్చి 15 (శనివారం): హోలీ, యయోసాంగ్ 2వ రోజు
మార్చి 22 (శనివారం): బీహార్ దివస్
మార్చి 27 (గురువారం): షబ్-ఐ-ఖదర్
మార్చి 28 (శుక్రవారం): జుమాత్-ఉల్-విదా
మార్చి 31 (సోమవారం): రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1), ఖుతుబ్-ఈ-రంజాన్
మార్చి 7 (శుక్రవారం): మిజోరంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నారు
మార్చి 13 (గురువారం): హోలికా దహన్ కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో బ్యాంకింగ్ సంస్థలు పనిచేయవు. కేరళలో అట్టుకల్ పొంగళ పండుగకు బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి 14 (శుక్రవారం): గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
మార్చి 15 (శనివారం): త్రిపుర, ఒడిశా, మణిపూర్, బీహార్‌లలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
మార్చి 22 (శనివారం): నాల్గవ శనివారం కావడంతో, అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయనున్నారు.
మార్చి 27 (గురువారం): షబ్-ఐ-ఖదర్ కారణంగా, జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు పనిచేయవు.
మార్చి 28 (శుక్రవారం): జుమాత్-ఉల్-విదా కోసం జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నారు.