అడల్ట్ ఫిల్మ్ స్టార్ రియా బర్డే అక్రమంగా భారతదేశంలో ఉంటున్నందుకు అరెస్టు అయ్యింది. మహారాష్ట్ర పోలీసులు రియాను అరెస్ట్ చేశారు. ఆమె బంగ్లాదేశ్ నివాసి. నకిలీ పత్రాలతో తన కుటుంబం సహ ఆమె భారతదేశంలో నివసిస్తుంది. ఈ విషయమై పోలీసులు రియా తల్లి, సోదరి, సోదరుడు, తండ్రి కోసం గాలిస్తున్నారు.
ఇదిలావుంటే.. పోలీసులు రియాను కోర్టులో హాజరుపరచగా.. ఏడుగురు న్యాయవాదుల బృందం ఆమె తరుపున వాదించారు. రియా బంగ్లాదేశీ అని ఏ ప్రాతిపదికన రుజువు చేస్తారని న్యాయవాదులు కోర్టులో ప్రశ్నించారు. రియా అరెస్ట్ వ్యవహారంపై సుమారు గంటన్నరపాటు విచారణ జరిగింది. అయితే కోర్టు రియాను అక్టోబర్ 1 వరకు థానే పోలీసుల కస్టడీకి పంపింది.
వయోజన పరిశ్రమలో ఆరోహి బిర్డే, బన్నా షేక్ అని పిలువబడే రియా రియా బర్డే.. రాజ్ కుంద్రా ప్రొడక్షన్ హౌస్‌తో అనుబంధం కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నకిలీ పత్రాల ఆధారంగా భారత పాస్‌పోర్ట్‌ను పొందినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. హిల్ లైన్ పోలీసులు సెప్టెంబర్ 26న ఆమెను అరెస్ట్ చేశారు. రియాపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420, 465, 468, 479, 14ఏ కింద కేసు నమోదు చేశారు. రియా తల్లి బంగ్లాదేశ్ నివాసి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు మహారాష్ట్ర నివాసి అయిన రియా తండ్రి అరవింద్ బర్డేతో వివాహం జరిగింది.