విశాఖ‌లో కొన‌సాగుతున్న బంద్‌

Bandh in Visakhapatnam to oppose privatisation of Steel Plant. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న చర్యను నిరసిస్తూ సోమవారం న‌గ‌ర‌ బంద్ జరుగుతోంది

By Medi Samrat  Published on  28 March 2022 7:29 AM GMT
విశాఖ‌లో కొన‌సాగుతున్న బంద్‌

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న చర్యను నిరసిస్తూ సోమవారం న‌గ‌ర‌ బంద్ జరుగుతోంది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపేందుకు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్లాంట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్లాంట్‌లోని మొత్తం 25,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు నాయ‌కులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త ఫోరం పిలుపునిచ్చిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖపట్నంలో బంద్ జరుగుతుంది.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నిరసన ర్యాలీ చేపట్టింది. ప్రైవేటీకరణకు కేంద్రం ముందుకురావ‌ద్ద‌ని హెచ్చరించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. కొందరు కేంద్రమంత్రులు మొక్కవోని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు ఇస్తున్నాయని కార్మిక సంఘాలు తెలిపాయి.

బంద్‌లో భాగంగా ఉదయం నుంచి వామపక్షాలు, కార్మిక సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. బ్యానర్లు, జెండాలు పట్టుకుని నిరసనకారులు కొన్ని చోట్ల రోడ్లను దిగ్బంధించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయంపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు.













Next Story