అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై మ‌రో 30 రోజులు నిషేధం

Ban on International Passenger Flights Extended Till June 30. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది. కేంద్రం ఇప్పుడు మ‌రో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

By జ్యోత్స్న  Published on  28 May 2021 5:48 PM IST
Ban on International Passenger Flights

క‌రోనా మహమ్మారి ఉధృతమైన నాటినుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలోనూ నిషేధం కొనసాగిస్తూ వ‌చ్చిన కేంద్రం ఇప్పుడు మ‌రో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక సర్క్యులర్‌లో తెలిపింది.

విమానాల నిలిపివేత నిర్ణయాన్ని భార‌త్ తీసుకుని దాదాపు 11 నెల‌లు అవుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంది. అయితే, ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చే ప్ర‌త్యేక విమానాలు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌వు.

అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం విధించినా, గత ఏడాది మే నుండి 'వందే భారత్ మిషన్' కింద మరియు జూలై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక "ఎయిర్ బబుల్" ఏర్పాట్ల కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. అమెరికా, యూకే,కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ , ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, ఇరాక్, యూఏఈ, జపాన్, మాల్దీవులు, కువైట్, నేపాల్, నైజీరియా, ఒమన్, నెదర్లాండ్స్, ఖతార్ తో స‌హా 28 దేశాల‌తో భార‌త్‌ ఈ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య కొన్ని షరతులతో విమానాలను తిరిగి ప్రారంభించే విధాన‌మే ఈ ఎయిర్ బ‌బుల్ ఒప్పందం ఉద్దేశం.




Next Story