కరోనాకు ఆయుర్వేద మందు ప్రకటించిన ఆయుష్ మంత్రిత్వశాఖ
Ayush Ministry Launches Distribution Of Kabasura Kudineer, AYUSH 64. కోవిడ్-19వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా
By Medi Samrat Published on 8 May 2021 4:18 PM GMTకోవిడ్-19వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి కరోనాపై విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఆయుర్వేదంలో కరోనాకు మందు ఉందని ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
అదే 'కబాసుర కుడినీర్-ఆయుష్ 64' అనే ఔషదం. ఇది సాధారణ, తక్కువ లక్షణాలు కలిగిన కోవిడ్ పేషెంట్లకు సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు నిర్వహించిన వరుస పరిశోధనల్లో తేలింది. దీన్ని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఎఎస్) అభివృద్ధి చేసింది. ఈ మందును 1980లో మలేరియా ను తగ్గించడం కోసం తయారు చేశారు. ఇప్పుడు కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనేందుకు అనుగుణంగా పునర్నిర్మించడం జరిగింది.
ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (సీసీఆర్ఎస్) ద్వారా 'కబాసుర కుడినీర్' పనితీరును కోవిడ్ పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సహకారంతో ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రైయల్స్ లో సాధారణ, తక్కువ లక్షణాలు కలిగిన కోవిడ్ పేషెంట్లకు సురక్షితమైనది, ప్రభావవంతంగా పనిచేస్తున్నదని గుర్తించారు.
ఈ నేపథ్యంలో 'కబాసుర కుడినీర్-ఆయుష్ 64' అనే ఔషధాల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ పీఎన్ రంజిత్ కుమార్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ముఖ్యంగా కోవిడ్ లక్షణాలు లేకపోయినా పాజటివ్ వచ్చిన వారికి, తక్కువ, సాధారణ కోవిడ్ లక్షణాలున్నవారికి సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కాబట్టి ఈ ఔషదాన్ని హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి, కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంటున్న వారికి, కోవిడ్ హెల్త్ సెంటర్లలో, ఆయుష్ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ డిస్పెన్సరీల్లో వీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను నేషనల్ ఆయుష్ మిషన్ కింద పంపవచ్చు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లోని ఆయుష్ శాఖ సిబ్బందిని కూడా 'కబాసుర కుడినీర్-ఆయుష్ 64' ను ఉపయోగించేలా చూడడం ద్వారా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని కేంద్ర ఆయుస్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ పీఎన్ రంజిత్ కుమార్ తన లేఖలో కోరారు.
The @moayush is launching a Nationwide distribution campaign on 7 May 2021 for its polyherbal drugs, AYUSH 64 and Kabasura Kudineer, at 12 PM. Campaign to be launched by Shri @KirenRijiju. Watch the live-streaming of the event on MoA social media handles. pic.twitter.com/w1aXDZfP1h
— Ministry of Ayush (@moayush) May 6, 2021