అయోధ్యలోని రామాలయానికి భద్రతా ముప్పు ఉందని ట్రస్ట్‌కు బెదిరింపు ఇమెయిల్ అందిందని సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఇమెయిల్ గురించి మరింత తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి ఈ ఇమెయిల్ అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పోలీసులు ఈమెయిల్ గురించి పెద్దగా సమాచారం పంచుకోనప్పటికీ, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఈమెయిల్‌ను ఇంగ్లీషులో రాశారని వారు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అధికారికంగా పోలీసులతో పాటు ట్రస్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.