అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచే వారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని, అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
జనవరి 22న ప్రతిష్ఠాపన చేసిన రాముడి విగ్రహానికి 'బాలక్ రామ్' అని నామకరణం చేసినట్లు ధృవీకరించారు. రాముడి విగ్రహానికి బాలక్ రామ్ అని పేరు పెట్టడానికి కారణం విగ్రహం చిన్న పిల్లవాడిని పోలి ఉండడమే అని అర్చకులు అరుణ్ దీక్షిత్ తెలిపారు. జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్ రామ్’గా పేరు పెట్టామని.. అయోధ్యలో కొలువుదీరిన రాముడు ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతోనే ఈ పేరును నిర్ణయించామన్నారు.