కాలువ‌లోకి దూసుకువెళ్లిన ఆటో.. ముగ్గురు జ‌ల‌స‌మాధి

Auto felled in TB canal.కూలీల‌తో వెలుతున్న ఆటో అదుపు త‌ప్పి కాలువ‌లోకి దూసుకుపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sept 2022 2:06 PM IST
కాలువ‌లోకి దూసుకువెళ్లిన ఆటో.. ముగ్గురు జ‌ల‌స‌మాధి

కూలీల‌తో వెలుతున్న ఆటో అదుపు త‌ప్పి కాలువ‌లోకి దూసుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు జ‌ల‌స‌మాధి కాగా.. మ‌రో ముగ్గురు గ‌ల్లంతు అయ్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కోలగల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం 11 మంది కూలీల‌తో వెలుతున్న ఆటో అదుపు త‌ప్పి తుంగభద్ర కెనాల్‌లోకి దూసుకువెళ్లింది. కొంద‌రు ఈదుకుంటూ ఒడ్డుకు వ‌చ్చి విష‌యాన్ని తెలుప‌గా.. స్పందించిన అధికారులు,స్థానికులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాల్వలో నుంచి ఆటోను ఎత్తేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. అయితే ఆటోకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో ఆటో కాల్వలో కొట్టుకుపోయింది.

దుర్గ‌మ్మ‌, లింగ‌మ్మ ఘ‌ట‌నాస్థ‌లంలోనే చ‌నిపోగా.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన పుష్ప‌వ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. ఆటో డ్రైవ‌ర్ భీమాతో పాటు శిల్ప‌, హేమావ‌తి, వీర‌మ్మ‌, మ‌హేశ్ ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌ల్లంతైన వారిని ఉలిగ‌మ్మ‌, ర‌త్నమ్మ, ల‌క్ష్మీగా గుర్తించారు. వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Next Story