స్కూల్ లో బాలికతో మాట్లాడాడు.. అతడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు ఓ అబ్బాయిపై ఓ గ్యాంగ్ దాడి చేసిన సంఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో చోటు చేసుకుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2024 4:00 AM GMTస్కూల్ లో బాలికతో మాట్లాడాడు.. అతడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు ఓ అబ్బాయిపై ఓ గ్యాంగ్ దాడి చేసిన సంఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో చోటు చేసుకుంది. ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉన్న ఓ బృందం.. పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని హుబ్బళ్లి, ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని చర్యలు ప్రారంభించాం. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. బాధితుడికి, ఇతరులకు మొదట వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్లు కొట్టారు.. పాఠశాలలో ఓ విద్యార్థినితో మాట్లాడినందుకు బాధితుడిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. అతనిపై దాడి చేసిన వారు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు. నలుగురు నిందితులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని, 19 ఏళ్ల నర్సింగ్ కాలేజీ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, నిందితుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశామని పోలీసులు తెలిపారు. హుబ్బళ్లి, ధార్వాడ్ జంటనగరాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులను సంప్రదించాలని కూడా సూచించారు.