అక్కడ వాహనాన్ని ఆపారంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం
ముంబైలో ఇటీవల ప్రధాని మోదీ అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించారు.
By Medi Samrat Published on 16 Jan 2024 3:15 PM GMTముంబైలో ఇటీవల ప్రధాని మోదీ అటల్ సేతు బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. ముంబైలోని సెవ్రి నుంచి రాయ్‌గడ్ జిల్లాలోని నవ సేవా వరకు ఆ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్‌ను పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇక ఆ బ్రిడ్జ్‌పై వాహనదారులు రూల్స్ ఉల్లంఘించి ప్రవేశిస్తున్నారు. భారత్‌లో అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును జాతికి అంకితం చేసిన వెంటనే ప్రజలు ఈ బ్రిడ్జిపై తమ వాహనాలను నిలిపివేసి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు.
అటల్ సేతు విహారయాత్ర ప్రదేశం కాదని ముంబై పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. వంతెనపై తమ వాహనాలను ఆపి ఫోటోలు తీసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటల్ సేతుపై ఆగి ఫొటోలు క్లిక్‌మనిపించడం చట్టవిరుద్ధమని, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై ఆగి, ఫొటోలు తీసుకునేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు హెచ్చరించారు. అటల్ సేతు చూడదగిన ప్రదేశమని తాము అంగీకరిస్తామని, అయితే ఈ ప్రతిష్టాత్మక వంతెనపై ఆగి ఫొటోలు తీయడం సరైంది కాదని అన్నారు. 17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ సేతు, 21.8 కిలోమీటర్ల పొడవైన వంతెన. దక్షిణ ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుండి కేవలం 20 నిమిషాలకు తగ్గించవచ్చు.