నా భ‌ర్త‌కు 89.. ఈ వ‌య‌సులో కూడా ఆ యావ చావలేదు.. భ‌ర్త‌పై భార్య ఫిర్యాదు

At Age of 89 husband harassing wife in Gujarat.89 ఏళ్ల వృద్ధుడు మరియు అతని భార్య తమ కొడుకు ఇంట్లో నివసిస్తున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2022 9:22 AM IST
నా భ‌ర్త‌కు 89.. ఈ వ‌య‌సులో కూడా ఆ యావ చావలేదు.. భ‌ర్త‌పై భార్య ఫిర్యాదు

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో 89 ఏళ్ల వృద్ధుడు మరియు అతని 87 ఏళ్ల భార్య తమ కొడుకు ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఈ వ‌య‌స్సులో కూడా శృంగారం కోసం వేదిస్తున్నాడ‌ని వృద్దురాలు మ‌హిళ‌ల కోసం ఏర్పాటు చేసిన అభయం హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 181లో సంప్రదించి ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో ఉన్నాన‌ని, అల‌స‌ట‌గా ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిపింది.

దీనికి సంబంధించి అభయం అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. "89 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన భార్యను తనతో తరచుగా శృంగారం చేయమని అడిగాడు. అత‌డి కోరిక‌లు తీర్చ‌లేద‌ని వృద్ధురాలిని వేదిస్తున్నాడు. వృద్ధాప్యం కార‌ణంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇరుగుపొరుగు వాళ్లందరికీ ఈ విష‌యం తెలుసు. వృద్ధుడి ఈ చర్యతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధురాలు అభయం హెల్ప్‌లైన్‌ను సంప్రదించిందని" తెలిపారు.

తొలిసారి ఇలాంటి స‌మ‌స్య‌ను విన్న అధికారుల‌కు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. అనంత‌రం వృద్ధురాలు ఉన్న ఇంటికి వెళ్లి ఆమె భ‌ర్త‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. యోగా చేయాల‌ని, గుళ్లూగోపురాలకు తిరగాలని, సాయంత్రాలు పార్కుకు వెళ్లి తోటి వృద్ధులతో స‌మ‌యం గడపాలని, తద్వారా శృంగారం నుంచి మనసు మళ్లుతుందని సూచించారు. మొత్తం మీద అధికారులు సూచ‌న‌లు ప‌ని చేశాయ‌ని తెలుస్తోంది.

Next Story