అసోంలో మళ్లీ పెరుగుతున్న హింస

Assam terror attackAssam terror attack. అసోంలో ప్రయాణిస్తున్న ఏడు ట్రక్కులను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి అగ్నికి

By M.S.R  Published on  28 Aug 2021 2:42 PM IST
అసోంలో మళ్లీ పెరుగుతున్న హింస

అసోంలో ప్రయాణిస్తున్న ఏడు ట్రక్కులను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి అగ్నికి ఆహుతి చేశారు. ఐదుగురు డ్రైవర్లను సజీవ దహనం చేశారు. దీంతో డిమా హసావో జిల్లాలోని దియుంగ్‌బ్రా ప్రాంతంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘటనకు స్థానిక మిలిటెంట్ గ్రూప్ డిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్‌ మొదలెట్టాయి. అనుమానిత మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో ట్రక్కు డ్రైవర్లపై అనేక రౌండ్ల కాల్పులు జరిపారు.

పలువురు డ్రైవర్లు, ట్రక్కుల అసిస్టెంట్లు సమీపంలోని అడవుల్లోకి పారిపోవడంతో వారు ప్రాణాలను నిలబెట్టుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఐదు మృతదేహాలను వెలికితీసింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ డీఎన్‌ఎల్‌ఏ హస్తం ఉండవచ్చని అసోం పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను పట్టుకోవడానికి అసోం రైఫిల్స్ సహాయం తీసుకుంన్నారు. గువాహతికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. మే నెలలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు డీఎన్‌ఎల్‌ఏ సభ్యులు చనిపోయారు.


Next Story