ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి
Ashok Gehlot to undergo angioplasty. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం
By M.S.R Published on 27 Aug 2021 7:43 AM GMTరాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన్ని జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. డెబ్భై ఏళ్ల వయసున్న గెహ్లోట్ కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురి కావడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు . పోస్ట్ కొవిడ్ సమస్యలున్న ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు. తన ఆరోగ్య స్థితిగతులపై స్వయంగా అశోక్ గెహ్లోట్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ప్రస్తుతం తనకు బాగానే ఉందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ట్వీట్‌లో తెలిపారు. ఇదిలా ఉంటే అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో గెహ్లోట్ ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital.Angioplasty will be done.I am happy that I'm getting it done at SMS Hospital.I am fine & will be back soon.Your blessings & well wishes r with me.
— Ashok Gehlot (@ashokgehlot51) August 27, 2021
"Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital. Angioplasty will be done. I am happy that I'm getting it done at SMS Hospital. I am fine & will be back soon. Your blessings & well wishes r with me (sic)," అంటూ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో అశోక్ గెహ్లాట్, ఆయన భార్య సునీతకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది.