ఇప్పుడు ఎవరు ఎవరికి బి-టీమ్.. సి-టీమ్..? : అసదుద్దీన్

Asaduddin Owaisi Hits Out at Akhilesh Yadav After SP's Bypoll Loss to BJP. అజంగఢ్, రాంపూర్ ఉపఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ బీజేపీ చేతిలో ఓడిపోయిన

By Medi Samrat  Published on  27 Jun 2022 10:26 AM GMT
ఇప్పుడు ఎవరు ఎవరికి బి-టీమ్.. సి-టీమ్..? : అసదుద్దీన్

అజంగఢ్, రాంపూర్ ఉపఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ బీజేపీ చేతిలో ఓడిపోయిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం నాడు సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "అఖిలేష్ యాదవ్ చాలా అహంకారి. అతని తండ్రి (యుపి మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్) ఆ స్థానం నుండి పార్లమెంటు సభ్యుడు. అప్పుడు అతను ఎన్నికయ్యాడు. తాను ఈ స్థానం నుంచి ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పేందుకు కూడా అక్కడికి వెళ్లడం లేదు'' అని హైదరాబాద్ ఎంపీ ఏఎన్ఐతో అన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీ బీజేపీని ఓడించలేకపోయాయని... వారికి మేధో నిజాయితీ లేదని చూపిస్తున్నాయి. ఇలాంటి అసమర్థ పార్టీలకు మైనారిటీలు ఓట్లు వేయకూడదు. భాజపా గెలుపుకు బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్. ఇప్పుడు ఎవరికి బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారని ప్రశ్నించారు.

అజంగఢ్, రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడంతో ఆ రెండు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. భోజ్‌పురి నటుడు-గాయకుడు బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ 'నిరాహువా' అజంగఢ్ స్థానంలో గెలుపొందగా, మరో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ లోధి సమాజ్‌వాదీ పార్టీ నుండి రాంపూర్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నారు.









Next Story