అమిత్ షా ప్రకటన అబద్ధం : ఒవైసీ

జనాభా సమస్యపై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబద్ధమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

By -  Medi Samrat
Published on : 11 Oct 2025 8:29 PM IST

అమిత్ షా ప్రకటన అబద్ధం : ఒవైసీ

జనాభా సమస్యపై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబద్ధమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మొదటి జనాభా లెక్కల నుంచి 2011 వరకు ముస్లిం జనాభా కేవలం 4.4% మాత్రమే పెరిగిందన్నారు. ఒక వర్గం జనాభా పెరుగుతోందని మోహ‌న్‌ భగవత్ మొదట అంటున్నారని, ఆ తర్వాత ఆదివాసీల జనాభా తగ్గుతోందని యోగి ఆదిత్యనాథ్ అంటున్నారని, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలని మోహ‌న్‌ భగవత్ చెబుతున్నారని ఒవైసీ అన్నారు.

ముస్లింల సంతానోత్పత్తి రేటు ఎక్కువగా పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, ఏదైనా చొరబాట్లు జరుగుతుంటే మీరు మంత్రిగా ఉన్నారని, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారని ఒవైసీ అన్నారు. బెంగాలీ మాట్లాడే ప్రతి భారతీయ ముస్లింను బంగ్లాదేశీ అని పిలవడం సరికాదన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హడావుడిగా జరిగిందని ఒవైసీ అన్నారు. పౌరసత్వ ధృవీకరణ హోం మంత్రిత్వ శాఖ పని అని, ఎన్నికల కమిషన్ ప‌ని కాదని ఆయన అన్నారు.

పేర్లు తొలగించిన వారిపై విచారణ జరిపితే ఓటింగ్ రోజు మళ్లీ గందరగోళం నెలకొంటుందని ఒవైసీ హెచ్చరించారు. ఈ అంశంపై ఏఐఎంఐఎం బీహార్ యూనిట్ చీఫ్ అక్తరుల్ ఇమాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముసాయిదా జాబితా నుంచి 6.5 లక్షల మంది పేర్లను తొలగించామని, ఆ తర్వాత 3.5 లక్షల మంది పేర్లను తొలగించామని కమిషన్ తెలిపింది.

Next Story