మళ్లీ ఎన్సీబీ ముందుకు షారుక్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌

Aryan Khan came to the NCB office again. షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇవాళ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముందు హాజరయ్యాడు. కోర్టు బెయిల్‌ షరతుల మేరకు

By అంజి  Published on  5 Nov 2021 1:36 PM IST
మళ్లీ ఎన్సీబీ ముందుకు షారుక్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌

షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఇవాళ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముందు హాజరయ్యాడు. కోర్టు బెయిల్‌ షరతుల మేరకు ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు. ఆర్యన్‌ ముంబై క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత నెల 2వ తేదీన క్రూయిజ్‌ షిప్‌లో ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. ఎన్సీబీ విచారణ అనంతరం ఆర్యన్‌ఖాన్‌ను ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్‌ కోసం ఆర్యన్‌ ఎన్నో సార్లు ప్రత్యేక కోర్టును ఆశ్రయించాడు. ప్రతీసారి బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. దీంతో ఆర్యన్‌ఖాన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మూడు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు బాంబే హైకోర్టు 14 షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

దీంతో మూడు వారాల జైలు శిక్ష తర్వాత ఆర్యన్‌ ఇంటికి చేరుకున్నాడు. అక్టోబర్‌ 28న బెయిల్‌ మంజూరు కాగా.. అక్టోబర్‌ 30న ఆర్యన్‌ జైలు నుంచి విడుదల అయ్యాడు. కోర్టు విధించిన షరతుల్లో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరు కావడం ఒకటి. ఈ నేపథ్యంలోనే ఆర్యన్‌ ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చాడు. మరోవైపు ముంబై డ్రగ్స్‌ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ కేసు విచారణ కీలకంగా మారింది.

Next Story