కేజ్రీవాల్ కు మళ్లీ షాక్

లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు శనివారం సీబీఐ అభ్యర్థనను స్వీకరించింది.

By Medi Samrat  Published on  29 Jun 2024 7:16 PM IST
కేజ్రీవాల్ కు మళ్లీ షాక్

లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు శనివారం సీబీఐ అభ్యర్థనను స్వీకరించింది. ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది. AAP చీఫ్ జూలై 12 వరకు జైలులో ఉంటారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను కోరిన కొన్ని గంటల తర్వాత కోర్టు ఉత్తర్వులు వెలువడింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ పిటిషన్‌పై నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.

కస్టోడియల్ ఇంటరాగేషన్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సహకరించలేదని సీబీఐ తన రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే రికార్డుల్లోని సాక్ష్యాలకు విరుద్ధంగా తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. తాజాగా జులై 12 వరకు ఆయనను కస్టడీకి ఇచ్చింది. కేజ్రీవాల్ మూడు రోజుల సీబీఐ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఆయన బెయిల్ పై బయటకు వస్తారని ఆశించగా.. మళ్లీ నిరాశ ఎదురైంది.

Next Story