తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తిరువణ్ణామలైకి బదులుగా అరుణాచలం అని బోర్డు ప్రదర్శించినందుకు తమిళనాడు ఆర్టీసీ యాజమాన్యం ఒక కండక్టర్‌ను సస్పెండ్ చేసింది. కళ్లకురిచ్చి ప్రభుత్వ రవాణా సంస్థ డిపో నుంచి ఒక బస్సు బెంగళూరుకు బయలుదేరింది. ఈ బస్సు ముందుభాగంలో ఎల్ఈడీ తెరపై తిరువణ్ణామలైకు బదులుగా అరుణాచలం అని ఆంగ్ల అక్షరాలలో ప్రదర్శించారు. దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
దీంతో ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. అరుణాచలం అనే పేరును ఉంచిన కళ్లకురిచ్చికి చెందిన కండక్టర్ విజయ రాఘవన్‌ను సస్పెండ్ చేస్తూ విల్లుపురం జోన్ జనరల్ మేనేజర్ జయశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తప్పనిసరిగా తిరువణ్ణామలై పేరునే ప్రదర్శించాలని కండక్టర్లకు సూచించారు.