రివార్డు మనీ కోసం యువ‌కుల‌ ఎన్‌కౌంటర్.. ఛార్జ్‌షీట్‌లో సంచ‌ల‌న విష‌యం

Army Capt staged encounter for Rs 20 lakh prize money. ఓ ఆర్మీ కెప్టెన్ రివార్డు మనీ కోసం యువ‌కుల‌ ఎన్‌కౌంటర్.ఛార్జ్‌షీట్‌లో సంచ‌ల‌న విష‌యం

By Medi Samrat  Published on  11 Jan 2021 7:40 AM GMT
murder for reward

ఓ ఆర్మీ కెప్టెన్ రివార్డు మనీ కోసం.. గతేడాది జులై 18న జమ్మూ అండ్ కశ్మీర్‌లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఎన్‌కౌంటర్ చేశారని కేసు ఛార్జ్ షీట్ ద్వారా సంచ‌ల‌న విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. రూ. 20లక్షల రివార్డు డ‌బ్బు కోసం ఇది జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివ‌రాళ్లోకెళితే.. రాజౌరీకి చెందిన యువకులు ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రార్ లను.. షోపియన్ జిల్లాలోని అంశీపురాలో టెర్రరిస్టులంటూ ముద్రవేసి ఎన్ కౌంటర్ చేశారని తేలింది.

పోలీస్ ఛార్జ్ షీట్ లో ఆ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్ (62RR).. మరో ఇద్దరు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడి సాక్ష్యాలు తారుమారుచేశారని.. కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైజ్ మనీ రూ.20లక్షలు దక్కించుకోవాలని ప్లాన్ చేశారని పేర్కొన్నారు. ఈ విష‌య‌మై షోపియన్ ఎస్పీ అమృత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్, తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ ల‌ పేర్లను 14వందల పేజీల ఛార్జి షీట్ లో ఫైల్ చేసి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉంచారని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. కెప్టెన్ కెప్టెన్ భూపేంద్ర సింగ్ టీంకు చెందిన కొంత‌మంది ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొంద‌ని.. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రదేశానికి పలు డైరక్షన్లలో వారంతా చేరుకున్నారని.. శబ్దం వచ్చినందున అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్నామని చెప్పార‌ని.. నిజానికి ముందుగా అంతా కలిసే ఎన్‌కౌంటర్ చేశా‌ర‌ని ఓ న్యూస్ ఏజెన్సీ క‌థ‌నం వెల్ల‌డించింది.


Next Story