Is Bank Open Today : ఈ రోజు బ్యాంకులు తెరుస్తారా.?
మీరు బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అవును అయితే ఈ వార్త మీకోసమే.
By - Medi Samrat |
మీరు బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అవును అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఈ రోజు శనివారం, తేదీ జనవరి 24. ఈ రోజు బ్యాంకు తెరుస్తారా లేదా అనే ప్రశ్న చాలా మంది మదిలో ఉంది. మీ మనస్సులో కూడా ఈ ప్రశ్న ఉంటే.. ఈ గందరగోళాన్ని క్లియర్ చేయబోతున్నాము.
ఈరోజు జనవరి 24వ తేదీ నెలలో నాలుగో శనివారం. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో లేదా నగరంలో బ్యాంకు శాఖలు తెరవబడవు. ఈరోజు నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు నెలలో కొన్ని శనివారాలు మాత్రమే తెరిచి ఉంటాయి.. మిగిలిన శనివారలు మూసివేయబడతాయి. సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, చివరి శనివారం మూసివేయబడతాయి. ఈ రోజు జనవరి 24. ఇది నెలలో నాల్గవ శనివారం కాబట్టి.. బ్యాంకులు మూసివేయబడతాయి.
వరుసగా నాలుగు రోజులు సెలవులు..
వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. అయితే, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు పనిచేస్తాయి.
జనవరి 24వ తేదీ నెలలో నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడతాయి.
జనవరి 25 ఆదివారం వస్తుంది.. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జనవరి 27న సమ్మె కారణంగా బ్యాంకుల్లో పనులు నిలిచిపోవచ్చు.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నాయకత్వంలో పిలుపునిచ్చిన ఈ సమ్మెలో ప్రధాన దృష్టి '5-రోజుల బ్యాంకింగ్' డిమాండ్. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని అమలు చేయాలన్నది బ్యాంకు యూనియన్ల అతిపెద్ద డిమాండ్. ప్రస్తుతం, బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే మూసివేయబడతాయి. అయితే బ్యాంకులు మొదటి, మూడవ, ఐదవ శనివారాలు పూర్తిగా తెరిచి ఉంటాయి. నెలలో అన్ని శనివారాలను అధికారిక సెలవులుగా ప్రకటించాలని యూనియన్ కోరుతోంది.
2024 మార్చిలో వేతన సవరణ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఈ డిమాండ్‌కు అంగీకరించిందని యూనియన్ వాదిస్తోంది. అయితే సమ్మతించినప్పటికీ అమలు చేసేందుకు అవసరమైన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.