పండ్లలో యాపిల్, ఆరెంజ్‌లు ఎంత ప్రత్యేకమో.. కాంగ్రెస్‌కు రాహుల్, ప్రియాంక కూడా అంతే..
లోక్‌సభలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి స్పందించారు.
By - అంజి |
పండ్లలో యాపిల్, ఆరెంజ్‌లు ఎంత ప్రత్యేకమో.. కాంగ్రెస్‌కు రాహుల్, ప్రియాంక కూడా అంతే..
లోక్‌సభలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి స్పందించారు. రాహుల్, ప్రియాంకల వ్యక్తిత్వాలు భిన్నమైనవని, వారి భాషా శైలి కూడా భిన్నంగా ఉంటుందని రేణుకా చౌదరి అన్నారు. ఇరువురు నేతలు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో చేసిన ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభలో ప్రియాంక గాంధీ ఆకట్టుకునే ప్రసంగం చేశారని, అయితే రాహుల్ ఈ అవకాశాన్ని వృధా చేశారని చర్చ జరుగుతోంది.
దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఎన్డీటీవీ ప్రశ్నించగా.. రాహుల్ సభలో బాగా మాట్లాడలేదని, ప్రియాంక బాగానే మాట్లాడారని అంటున్నారు. ఇది కేవలం ఎదో ఒకటి అనడమే.. ప్రియాంక తన సబ్జెక్ట్‌పై మాట్లాడగా.. రాహుల్ కూడా తన సబ్జెక్ట్‌పై మాట్లాడాడు.. ఇద్దరి స్టైల్ వేరు.. ఒక్కొక్కరి మాట తీరు వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారని అన్నారు. రాహుల్, ప్రియాంకలను పోల్చలేం.. ఇద్దరూ తమదైన శైలిలో మాట్లాడుతుంటారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే రాహుల్, ప్రియాంకలను యాపిల్, ఆరెంజ్‌లతో పోల్చారు. పండ్లలో యాపిల్స్, ఆరెంజ్‌లు ఎంత ప్రత్యేకమో, కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అంతే ప్రత్యేకమని రేణుక అన్నారు. వాటిని ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోల్చకూడదు. రాహుల్, ప్రియాంక మధ్య మంచి వక్త ఎవరు అని రేణుకా చౌదరిని అడగగా.. ఆమె సమాధానమివ్వడానికి నిరాకరించింది. వారు చాలా భిన్నంగా ఉన్నందున.. ఒకరు మరొకరి కంటే మెరుగైన లేదా అధ్వాన్నంగా ఉండాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.