బ్రాహ్మణులపై అవమానకరమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రఖ్యాత చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 17న, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వినియోగదారుకు ప్రతిస్పందిస్తూ కశ్యప్ బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ నివాసి ఉజ్వల్ గౌర్ న్యూ ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. బ్రాహ్మణ సమాజంపై కశ్యప్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమైనవి, రెచ్చగొట్టేవని ఉజ్వల్ గౌర్ అన్నారు. అలాంటి ప్రకటనలు ద్వేషాన్ని రేకెత్తిస్తాయి, ప్రజా శాంతికి భంగం కలిగిస్తాయి, మత ఉద్రిక్తతను పెంచుతాయని గౌర్ తెలిపారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం నడుమ కశ్యప్ శుక్రవారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పారు.