ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభ మేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రయాగ్ రాజ్ సెక్టార్-22లోని ఛట్ నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. కాగా 11 రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాద ఘటనలో 18 టెంట్లు మంటల ధాటికి కాలిపోయాయి.