కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

Angry Kashmiri Pandits block road to protest target killing by terrorists. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.

By Medi Samrat  Published on  15 Oct 2022 7:30 PM IST
కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్ ఏరియాలో ఆయన ఇంటి వద్దే చంపేశారు. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాణ్ కృష్ణన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఆయన ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు.

తమకు రక్షణ కల్పించాలని.. వందలాది మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగులు శనివారం జమ్మూ-అఖ్నూర్ రహదారిని దిగ్బంధించారు. లోయలో ఉగ్రవాదులు తమ వర్గానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడాన్ని నిరసించారు. గత మేలో కాశ్మీర్‌లో తమ సహోద్యోగి రాహుల్ భట్ హత్యకు గురైన తర్వాత ప్రధానమంత్రి ఉపాధి ప్యాకేజీ కింద పనిచేస్తున్న పండిట్లు గత ఐదు నెలలుగా జమ్మూలోని రిలీఫ్ కమీషనర్ల కార్యాలయం వద్ద నిరసనలు చేస్తున్నారు.


Next Story