మోదీపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అసంతృప్తి.. రాజకీయాలు సరికాదన్న వైఎస్ జగన్

Andhra CM Reprimands Jharkhand CM. నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  7 May 2021 11:38 AM GMT
Jharkhand CM

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రులు చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల గురించి కూడా చెబుతూ ఉన్నారు. కొందరు ముఖ్యమంత్రులైతే ప్రధాని తీరుపై విమర్శలు కూడా చేస్తున్నారు. నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనతో మాట్లాడారని, కానీ ఆయన ఏమనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప, తన మాటలేవీ ఆయన వినిపించుకోలేదని సోరేన్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయాల్లో తాము తీసుకుంటున్న చర్యల గురించి వింటే సంతృప్తికరంగా ఉండేదన్నారు. హేమంత్ సొరేన్ వ్యాఖ్యలు ఓ వైపు దుమారం రేపుతూ ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

"డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరుతున్నదేమిటంటే.. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో ఒకరిని వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు" అని జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ నుండి ఈ రకమైన ట్వీట్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.


Next Story
Share it