పంజాబ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

An Earthquake occurred at west northwest of Amritsar. పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై

By అంజి  Published on  14 Nov 2022 8:54 AM IST
పంజాబ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదు అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇవాళ తెల్లవారు 3.42 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం అమృత్‌సర్‌కు పశ్చిమ - వాయువ్యంగా 145 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 120 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.

నవంబర్‌ 12వ తేదీ రాత్రి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌, నోయిడా, బిజ్నోర్‌, మొరాదాబాద్‌, అమ్రోహాలో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌, అల్మోరా, చమోలి, రాంనగర్‌, ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది.

నేపాల్‌లో ఇటీవల తరచూ భూంకపాలు వస్తున్నాయి. నేపాల్‌లో శనివారం రాత్రి 7.57 గంటల ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి.

భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం.. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఢీకొనే జోన్‌ను ఫాల్ట్‌ లైన్‌ అంటారు. పదేపదే ఢీకొనడం వల్ల ప్లేట్ల మూలలు వంగి ఉంటాయి. చాలా ఒత్తిడి పెరిగినప్పుడు ప్లేట్లు విరిగిపోతాయి. ఈ క్రమంలోనే భూకంపం సంభవిస్తుంది. ఇది కాకుండా ఉల్క ప్రభావాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, గనుల పరీక్ష, అణుపరీక్షలు కూడా భూకంపాలకు కారణాలు.

Next Story