పాట పాడుతూ చిందులేసిన మాజీ సీఎం భార్య.. సోషల్‌ మీడియాలో రచ్చ.!

Amruta fadnavis song manike mage hithe. సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం భార్య

By అంజి  Published on  21 Nov 2021 8:57 AM GMT
పాట పాడుతూ చిందులేసిన మాజీ సీఎం భార్య.. సోషల్‌ మీడియాలో రచ్చ.!

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం భార్య అమృత ఫడ్నవీస్ కూడా తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేసింది. "కొనసాగుతున్న రాజకీయ కాలాల మధ్య, ఈ కూల్ పాటతో చిల్ పిల్ తీసుకోండి" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పోస్టుకు అమృత ఫడ్నవిస్ క్యాప్షన్‌గా రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలంక దేశానికి చెందిన మణికే మాగే హితే పాట సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా బాషల్లోకి ఈ పాట వర్షన్‌లు వచ్చాయి.

తాజాగా ఈ పాటలో కొన్ని మార్పులు చేసి అమృత ఫడ్నవీస్‌ పాడింది. ఈ పాటలో అమృత ఎరుపు రంగు టైట్‌ ప్యాంట్‌, టీషర్ట్‌, దాని మీద తెలుపు రంగ్‌ షర్ట్‌ వేసుకుని.. హిందీలో పాట పాడుతూ ఆడింది. అయితే అమృత ఫడ్నవీస్‌ పాడిన పాట, ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె వేసుకున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఎంత పద్ధతిగా ఉండాలి అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. మరీ ఇంత అవసరమా అంటూ మండిపడుతున్నారు. మణికే మాగే హితే పాట ఇప్పటికీ ప్రజల చెవుల్లో మారుమ్రోగుతోంది. సింగర్ యోహాని దిలోకా డి సిల్వా వాయిస్‌తో పాటు ఈ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది.


Next Story