ఖలిస్థాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులకు ఆదివారం నాడు లొంగిపోయాడు. దీనిపై ఆయన తల్లిదండ్రులు తొలిసారి స్పందించారు. మోగా జిల్లా రోడె గ్రామంలోనే ఓ గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అమృత్‌పాల్ లొంగిపోయారు. నేషనల్ సెక్యూరీటీ యాక్ట్ కింద అమృత్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మృత్‌పాల్ అరెస్టుపై ఆయన తల్లి బల్విందర్ కౌర్ స్పందిస్తూ, తన కొడుకు సింహమని.. సింహంలాగే లొంగిపోయాడని, తన కొడుకును చూసి గర్విస్తున్నానని అన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తన కుమారుడు పోరాటం చేసినట్టు అమృత్‌పాల్ సింగ్ తండ్రి తరసేమ్ సింగ్ అన్నారు. ఆయన చేపట్టిన మిషన్ ముందుకు సాగాలన్నారు. అమృత్‌పాల్ అరెస్టుపై ఆయన కుటుంబం న్యాయపోరాటం సాగిస్తుందని అమృత్‌పాల్ మేనమామ సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు.