పౌరసత్వ సవరణ చట్టం పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

Amit Shah's New Chronology, Vaccine First; CAA, NRC Later. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన

By Medi Samrat  Published on  22 Dec 2020 6:23 PM IST
పౌరసత్వ సవరణ చట్టం పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ప్రజలతో పాటూ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మరోసారి పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం కరోనా కారణంగా మరుగున పడిందని, దేశంలో టీకా పంపిణీ ఒకసారి మొదలు కాగానే దాని సంగతి చూస్తామని అమిత్ షా అన్నారు. ఈ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించడం ఓ భారీ ప్రక్రియ అని, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కొనసాగించడం కష్టమన్నారు.

వ్యాక్సిన్ పంపిణీ అందుబాటులోకి వచ్చి కరోనాను ఖతం చేసిన తర్వాత మాత్రమే సీఏఏపై దృష్టి సారిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడిని ఖండించిన షా, ఈ ఘటనకు మమత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి తర్వాత అమిత్‌ షా బెంగాల్లో పర్యటిస్తున్నారు. అమిత్ షా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈఘటనకు తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి బీజేపీకే పరిమితం కాదని.. ఇది పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. చొరబాటు దారులను మమతా బెనర్జీ ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉందని అమిత్ షా అన్నారు.




Next Story