హోంమంత్రి అమిత్ షాపై కుమారస్వామి తీవ్ర విమర్శలు

Amit Shah is Joseph Goebbels reincarnated, says Kumaraswamy. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు.

By M.S.R  Published on  2 Jan 2023 11:20 AM GMT
హోంమంత్రి అమిత్ షాపై కుమారస్వామి తీవ్ర విమర్శలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఎనిమిదేళ్ల పాలనలో మన దేశాన్ని విధ్వంస మార్గంలోకి తీసుకెళ్లారని అన్నారు. బీజేపీ ఒక కపట పార్టీ అయితే, అమిత్ షా ఊసరవెల్లి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేయాలని... జేడీఎస్ పార్టీ కన్నడిగులకు ఏటీఎంగా మారుతుందని కుమారస్వామి చెప్పారు. తాము పేదలు, కూలీలు, రైతుల ఏటీఎంగా మారుతామని.. ఏటీఎం అంటే ఎనీటైమ్ హ్యుమానిటీ అని అన్నారు.

కుమారస్వామి అమిత్ షాను జోసెఫ్ గోబెల్స్‌తో పోల్చడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్య విరుచుకుపడ్డారు. కుమారస్వామి వాడిన అన్‌పార్లమెంటరీ పదం అతను రాజకీయ నిరాశలో ఉన్నాడని ప్రపంచానికి తెలియజేస్తుందని సూర్య అన్నారు. జేడీఎస్ పార్టీ ఇప్పటికే అంతరించిపోతున్న పార్టీగా మారింది. ఎన్నికల తర్వాత, కర్ణాటకలో జేడీఎస్ కనిపించదని సూర్య విమర్శలు గుప్పించారు.


Next Story