2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 160 స్థానాలను దాటింది. ఉదయం 10.15 గంటలకు ఎన్డీఏ 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్‌లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్డీఏ 160 సీట్లు గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఒక వారం తర్వాత అమిత్ షా అంచనాలు నిజమయ్యాయి.
ఇక పది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలుపుకునే దిశగా దూసుకుపోతోంది. చాలా ఏజెన్సీలు పాలక సంకీర్ణానికి 2020లో వచ్చిన 125 సీట్లతో పోలిస్తే బలమైన ఆధిక్యత ఉంటుందని అంచనా వేశాయి. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ 147 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోగలదని, మెజారిటీ మార్కు 122ని సులభంగా దాటగలదని పలు పోల్స్ సూచించాయి.