ఒడిశా: అంబులెన్స్ డ్రైవర్ వీలైనంత త్వరగా రోగులను ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలో తన వాహనాన్ని ఆపి, గాయపడిన తన ప్రయాణీకుడికి ఒక పెగ్ అందించాడు.. పనిలో పనిగా అతడు కూడా మద్యం పుచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, అంబులెన్స్ డ్రైవర్ తాను తాగడమే కాకుండా.. రోగికి మద్యం పెగ్‌లను అందించాడు. తిర్టోల్ ప్రాంతంలోని హైవే పక్కన తన వాహనాన్ని ఆపి ఈ పని చేశాడు. చుట్టుపక్కలవారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో సోమవారం ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
డ్రైవర్‌ను ప్రశ్నించగా.. రోగి స్వయంగా డ్రింక్ అడిగాడని అతను చెప్పాడు. అంబులెన్స్‌లో ఓ మహిళ, చిన్నారి కూడా కనిపించారు. జగత్‌సింగ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) డాక్టర్ క్షేత్రబాసి దాస్ PTI తో మాట్లాడుతూ, "ఇది ప్రైవేట్ అంబులెన్స్ కాబట్టి, దీనికి మేము స్పందించాల్సిన అవసరం లేదు. అయితే RTO, సంబంధిత పోలీసు స్టేషన్ డ్రైవర్‌పై చర్య తీసుకోవాలి." అని అన్నారు. స్థానికులు ఘటనపై విచారణ జరిపి అంబులెన్స్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తేనే దర్యాప్తు ప్రారంభిస్తామని తిర్టోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ జుగల్ కిషోర్ దాస్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ట్రాఫిక్ నేరంగా పరిగణించబడుతుందని అన్నారు.