ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠ‌తో ఎదురుచూపులు

ఎగ్జిట్ పోల్స్ కోసం నేతలు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. 7వ దశ ఓటింగ్ ముగిసిన తర్వాత 2024-లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం 6:30 గంటలకు వెలువడనున్నాయి.

By Medi Samrat  Published on  1 Jun 2024 5:45 PM IST
ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠ‌తో ఎదురుచూపులు

ఎగ్జిట్ పోల్స్ కోసం నేతలు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. 7వ దశ ఓటింగ్ ముగిసిన తర్వాత 2024-లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం 6:30 గంటలకు వెలువడనున్నాయి.

జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం టెలివిజన్ ఛానెల్‌లు, న్యూస్ అవుట్‌లెట్‌లు ఎగ్జిట్ పోల్ డేటాను దాని ఫలితాలను జూన్ 4 సాయంత్రం 6.30 గంటల తర్వాత విడుదల చేయాల్సి ఉంటుంది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశ ప్రజలు ఎవరికి ఓటు వేశారు అనే దాని గురించి ఒక అంచనా వస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అంచనాలను అందించి ప్రజల్లో టెన్షన్ ను మరింతగా పెంచారు. ఏడవ దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా రాబోతున్నాయని తెలుగు ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోనే ఉంటుందా.. కొత్త ప్రభుత్వం వస్తుందా అనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ ఓ క్లారిటీ ఇస్తాయా లేదా అన్నది కూడా త్వరలోనే తెలుస్తుంది.

Next Story