కస్టమర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు చుక్కలు చూపించింది.

By Medi Samrat  Published on  26 Dec 2024 9:14 AM
కస్టమర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు చుక్కలు చూపించింది. కాల్స్ కనెక్ట్ అవ్వక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం ఎయిర్‌టెల్ సేవలు అకస్మాత్తుగా సమస్యను ఎదుర్కొన్నాయి, దాదాపు 3,000 ఫిర్యాదులు ఈ తెల్లవారుజామున నివేదించారు. చాలా మంది వినియోగదారులు స్లో ఇంటర్నెట్, కనెక్షన్ లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియాలో నివేదించారు.

సాధారణం కంటే ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు డౌన్‌డెటెక్టర్ అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. అనుకున్నదానికంటే పెద్ద సమస్య ఉండడంతో ఎయిర్ టెల్ వినియోగదారులు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌టెల్ వినియోగదారులు కంపెనీ అప్‌డేట్‌ల కోసం వేచి చూసారు.ఈ అంతరాయం చాలా మందికి ఇబ్బంది కలిగించింది. వారి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసింది.


Next Story