న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది.

By M.S.R  Published on  14 Oct 2024 9:00 AM IST
న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది. "విమానం ప్రస్తుతం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అన్ని ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లు పాటిస్తున్నాము" అని సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు.

ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరిన విమానానికి వెంటనే బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది.

Next Story