ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎంఐఎం

AIMIM to contest Uttar Pradesh municipal polls. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో

By Medi Samrat  Published on  19 Aug 2022 2:19 PM IST
ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎంఐఎం

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల‌లో తన ఉనికిని చాటుకోవడంలో విఫలమైంది ఎంఐఎం. అయితే.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జ‌రుగనున్న‌ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఏఐఎంఐఎం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. ''హైదరాబాద్‌లోని అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంలో మమ్మల్ని సమావేశానికి పిలిచారు. మాకు ఇచ్చిన సూచనలను అనుసరించి.. దానిపై పని చేస్తాం. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జ‌రుగ‌నున్న‌ మునిసిపల్ ఎన్నిక‌ల‌కు అభ్యర్ధుల‌ను ప్రకటిస్తామని అన్నారు.

2022లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కొందరు పార్టీ నేతల అసమర్థతను ఎత్తిచూపుతూ.. "అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఒకప్పుడు బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అయితే.. నేడు ఆ పార్టీ ఎక్కడ ఉందో చూడాలి. కాబట్టి.. కొంత సమయం పడుతుంది, మాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. పార్టీలో కొంతమంది నిజాయితీగా పని చేయలేదు. ఈసారి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతాం. అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) మధ్య పోరు మాత్రమే కాదని, ఎఐఎంఐఎం కూడా ఒక కారణమని ఆయన అన్నారు. ఎస్పీ ముస్లింలకు వ్యతిరేకమని.. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సమాజం వెనుకబాటుకు కార‌ణమని ఖాన్ పేర్కొన్నారు.

AIMIM అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. ఈసారి మేము గత సారి కంటే ఎక్కువ బ‌లంగా పోరాడి ఎక్కువ‌ సీట్లు గెలుచుకుంటాము. రాష్ట్రంలో ఘజియాబాద్‌ నుంచి ఘాజీపూర్‌ వరకు ఎన్నికల్లో పోటీ చేస్తాం' అని ఆయన చెప్పారు.


Next Story