దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని మూడు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 42 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 శాతం పెంపుదల జూలై 1, 2024 నుండి అమల్లోకి రానుండగా.. వచ్చే డీఏ, డీఆర్‌లు 45 శాతానికి పెరగనుంది. గతేడాది మార్చి 24న కూడా కేంద్ర ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచింది. కేంద్ర ఉద్యోగులకు మూడు నెలల అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ల డీఏ బకాయిలతో సహా చెల్లిస్తారు. ఇదిలావుంటే.. దీపావళికి ముందే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ఇచ్చింది. విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.