కృష్ణుడి చేయి విరిగిందంటూ ఆస్పత్రికి వచ్చిన పూజారి.. విగ్రహానికి కట్టుకట్టిన వైద్యులు.. వైరల్ వీడియో.!

Agra priest breaks down at hospital, asks doctors to bandage Krishna idol's broken arm. కృష్ణుడి విగ్రహానికి ఉదయం స్నానం చేయిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు చేయి జారి కింద పడి చేయి విరిగిందని లేఖ్‌ సింగ్‌ అనే పూజారి తెలిపాడు.

By అంజి  Published on  21 Nov 2021 4:06 PM IST
కృష్ణుడి చేయి విరిగిందంటూ ఆస్పత్రికి వచ్చిన పూజారి.. విగ్రహానికి కట్టుకట్టిన వైద్యులు.. వైరల్ వీడియో.!

ఆగ్రాలోని ఆసుపత్రిలో శుక్రవారం నాడు ఓ పూజారి తన కృష్ణుడి విగ్రహం చేయి విరిగిందంటూ ఆస్పత్రికి వచ్చాడు. విరిగిన చేతికి కట్టుకట్టాలని అక్కడున్న వైద్య సిబ్బందిని కోరగా.. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కృష్ణుడి విగ్రహానికి ఉదయం స్నానం చేయిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు చేయి జారి కింద పడి చేయి విరిగిందని లేఖ్‌ సింగ్‌ అనే పూజారి తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూజారి ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి చేరుకుని విగ్రహానికి చికిత్స చేయాలంటూ పట్టుబట్టారు. ఆయనతో పాటు కొందరు స్థానికులు కూడా ఉన్నారు. కొంత సేపటి తర్వాత ఆస్పత్రి సిబ్బంది 'శ్రీకృష్ణ' పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి.. శ్రీకృష్ణుడి విగ్రహానికి కట్టు కట్టారు. ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ ట్రెండీ ట్రైల్స్‌లో పోస్ట్ చేశారు. పూజారి భక్తికి నెటిజన్లు చలించిపోయి తమ స్పందనలను కామెంట్స్ బాక్స్‌లో పెడుతున్నారు. పూజారికి కృష్ణుడిపై ఉన్న విశ్వాసం నన్ను తీవ్రంగా కదిలించిందని ఒక నెటిజన్ చెప్పాడు.

పూజారి లేఖ్ సింగ్ మాట్లాడుతూ.. ఉదయం పూట పూజ చేసి స్వామివారి విగ్రహానికి స్నానం చేయిస్తుండగా విగ్రహం జారిపడి చేయి విరిగిందని తెలిపారు. తాను దేవుడితో అనుబంధం కలిగి ఉన్నందున నేను తీవ్రంగా బాధపడ్డాను. శ్రీకృష్ణుడికి చికిత్స చేయించేందుకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాను. అని తెలిపారు. ఆసుపత్రిలో తన అభ్యర్థనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తాను లోపల నుండి విరిగిపోయి నా దేవుడి కోసం ఏడవడం ప్రారంభించాను అని పూజారి చెప్పారు. తాను అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా పనిచేశానని తెలిపాడు. జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఒక పూజారి.. చేయి విరిగిన విగ్రహంతో వచ్చి చికిత్స చేయమని ఏడుస్తున్నట్లు ఆసుపత్రి నుండి తనకు సమాచారం అందిందని చెప్పారు. పూజారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని విగ్రహానికి శ్రీకృష్ణుడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించామని చెప్పారు. పూజారి సంతృప్తి కోసం మేము విగ్రహానికి కట్టు కట్టాము అని డాక్టర్ అగర్వాల్ చెప్పారు.


Next Story