ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్‌పై నటి స్టేట్‌మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2025 9:10 AM IST
ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్‌పై నటి స్టేట్‌మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, దుబాయ్‌లో బంగారు కొనుగోలు చేసిన రన్యారావు.. స్విట్జర్లాండ్ వెళుతున్నట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులను నమ్మించింది. డీఆర్‌ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, రన్యా రావు తాను తరచుగా చేసే విదేశీ ప్రయాణాలను మరియు బంగారాన్ని ఎలా అక్రమంగా రవాణా చేశానో వివరించింది. దుబాయ్ నుండి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం ఇదే మొదటిసారి అని కూడా ఆమె చెప్పింది. తాను ఇంతకు ముందు ఎప్పుడూ దుబాయ్ నుండి బంగారం తీసుకురాలేదని ఆమె చెప్పింది. "నేను దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం ఇదే మొదటిసారి" అని ఆమె దుబాయ్ పర్యటనల గురించి DRI అధికారులకు చెప్పింది.
కానీ, ఆమె అక్రమ బంగారంతో భారత్‌కు చేరుకునేవారు. స్వదేశీ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు వీఐపీలను ఉపయోగించే గ్రీన్ చానెల్‌ను ఉపయోగించేవారని డీఆర్ఐ అధికారులు విచారణలో వెల్లడైంది. అలాగే, ఆమె దుబాయ్‌లో కొనుగోలు చేసే బంగారాన్ని నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలలో దాచి తెచ్చేవారని గుర్తించారు. విమానాశ్రయంలో గ్రీన్ చానెల్‌లో వెళ్లే వీఐపీలు, కస్టమ్స్ క్లియరెన్స్ లేని వస్తువులను తీసుకెళ్లేవారు. అలా రన్యా రావు పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్టు డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.